సాగర్ జలాలు విడుదల చేయాలి

by Sridhar Babu |
సాగర్ జలాలు విడుదల చేయాలి
X

దిశ, తల్లాడ : సాగర్ జలాలను తక్షణమే విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు గురువారం ఐబీ డీఈ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరి ప్రస్తుతం పొట్ట దశలో ఉందని, సాగునీరు లేక ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. వరితోపాటు మిర్చి, పత్తి, ఇతర పంటలకు నీరు లేకపోవడంతో ఎండిపోతున్నాయని, వెంటనే విడుదల చేయాలని కోరారు.

స్పందించిన డీఈ కాలువ తెగిపోవడం వల్ల సాగర్​ జలాలు ఆలస్యం అవుతుందని, ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయని తెలిపారు. అతి త్వరలోనే సాగర్ జలాలను విడుదల చేస్తామని, రైతులు ఆందోళనకు గురికావద్దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుండేటి వీరారెడ్డి, తల్లాడ పట్టణ అధ్యక్షులు దగ్గుల నాగిరెడ్డి, నాయకులు రాయల రాము, తుమ్మలపల్లి రమేష్, అయినాల నరసింహారావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed