రూ.18వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాంః మంత్రి తుమ్మల

by Nagam Mallesh |
రూ.18వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాంః మంత్రి తుమ్మల
X

దిశ, ఖమ్మంః తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటి పంట కాలంలో రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనే అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం పోయిందని ప్రతిపక్ష పార్టీలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పది సంవత్సరాలుగా రైతులు గురించి మాట్లాడనివారు, ఈ రోజు రైతుల జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్దీ మంది తప్పుడు దుర్బుద్ధితో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మొదటి పంటలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. ఆగస్టు 14 లోపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు లిస్టు తయారు చేసి ప్రభుత్వం దానికి అనుకుగుణంగా చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 బ్యాంకులు, 5782 బ్రాంచీల ద్వారా 4178892 మంది రైతులు ఉన్నారని నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. కు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తారీఖున రూ.18 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లోకి జమ చేశామన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లాంటి సాంకేతిక ఇబ్బందులు వల్లన కొన్నీ ఆగాయని, వాటిని మండల వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆగిన రైతులకు ఎకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్నారు. మూడు రోజులుగా గత ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచుకునేదుకు కొద్దీ మంది రైతలను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

40 బ్యాంకు ల నుండి ఇచ్చినా లిస్టు ప్రకారం నగదు జమ చేశామన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల కి కొద్దీ రోజుల ముందు భూటకు మాటలతో ఓ ఆర్ ఆర్ తాకట్టు పెట్టి లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని కొద్దీ మంది కి మాఫీ చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల కుటుంబ సమగ్ర సర్వే సరిగా చేయలేదని, 40 లక్షల రైతులు ఉంటే, 10 లక్షల రైతులకు రుణమాఫీ చేసిందని కాగ్ రిపోర్టు ఇచ్చింది, దీనికి ముందు గా సమాధానం చెప్పాలన్నారు. కాగ్ నివేదిక లో కూడా గత ప్రభుత్వం తీసుకున్న రుణామాఫీ నిర్ణయాన్ని తప్పు పట్టిందని గుర్తు చేశారు. ప్రతి పక్ష పార్టీల రాజకీయ లబ్ధి కోసమే... ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని రైతులు గమనించాలని మంత్రి రైతులను కోరారు.

కేటీఆర్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో రుణమాఫీ కానీ వాళ్ళు బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఆ తర్వాత వారికి కూడా ఋణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సంయపాలన పాటించండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని కోరారు. రుణమాఫీ కానీ రైతులు తమ ఆధారాలను వ్యవసాయ అధికారులకు ఇచ్చి రుణ విముక్తి పొందాలని కోరారు.

Next Story

Most Viewed