- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ కథనానికి స్పందన.. పేరు తొలగించిన ఆర్ అండ్ బి అధికారులు
దిశ, పాలేరు: "నేలకొండపల్లిని కొండపల్లిగా మార్చిన ఆర్ అండ్ బి అధికారులు" అంటూ 'దిశ' అందించిన కథనానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించారు. శుక్రవారం కూసుమంచి మండల కేంద్రం నుండి నేలకొండపల్లి వరకు ఉన్న కిలోమీటర్ సూచిక కొలత రాళ్లపై నేలకొండపల్లికి బదులు కొండపల్లి అంటూ రాసిన తప్పు రాతలను వెంటనే చేరిపి వేశారు. దిశ కథనం ప్రస్తుతం వైరల్‌గా మారడంతో నెటిజన్లు అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ కథనాన్ని చూసిన అధికారులు వెంటనే కొలత రాళ్ళపై తప్పుగా రాయించినట్లు గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్‌ని వెంటనే పేరు సరి చేయాలని సూచించినట్లు ఫోన్ ద్వారా 'దిశ'కు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం హుటాహుటిన వచ్చి కిలోమీటర్ కొలత రాళ్లపై ఉన్న పేరును తొలగించారు. ఈ విషయాన్ని గమనించిన పలువురు వ్యవస్థ తీరును సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా ఎత్తిపొడుస్తున్నారు. మరి తర్వాతైనా సరిగా రాస్తారో లేదో వేచి చూడాలి.