Puvvada Ajay Kumar : రేవంత్ రెడ్డికి ఆగస్టు గండం కాకపోయినా.. త్వరలోనే 420 గండం ఖాయం

by Sridhar Babu |
Puvvada Ajay Kumar : రేవంత్ రెడ్డికి ఆగస్టు గండం కాకపోయినా.. త్వరలోనే 420 గండం ఖాయం
X

దిశ, ఖమ్మం : రేవంత్ రెడ్డి సర్కార్ కు ఆగస్టు గండం కాకపోయినా త్వరలోనే 420 గండం ఖాయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోష్యం చెప్పారు. ఆదివారం ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్త సమావేశంలో ఆయన మాట్లాడారు...ఆరోగ్య కారణాలవల్లే మీ అందరికీ దూరంగా ఉంటున్నానని, అపోహ వద్దు తొందర్లోనే పూర్తిగా కోలుకొని గులాబీ జెండా నీడనే.. కేసీఆర్ బాటలోనే ఖమ్మం ప్రయోజనాల కోసం పోరాడతా అని భరోసానిచ్చారు. అమెరికాకు పోయాడు క్యాన్సర్ సోకింది అని ఒకరు..

టీడీపీకి పోతున్నారని మరొకరు.. బీజేపీతో ఇప్పటికే మంతనాలు పూర్తి అయ్యాయని మరొకరు ప్రచారాలు చేస్తున్నారని, ఈ ప్రచారాలు నమ్మొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆదేశిస్తే రాష్ట్ర నాయకత్వంతో కలిసి కీలకంగా వ్యవహరించే కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కేటీఆర్ నన్ను సొంత సోదరుడి కన్నా ఎక్కువగా చూసుకున్నాడని గుర్తు చేశారు‌. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒకే మంత్రిగా అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేశానని, నేడు ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లా ప్రగతికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చుకొని నేటి పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు.

నాడు ఖమ్మం ఎట్లుండే నేడు ఎట్లుంది..

నాడు ఖమ్మం ఎట్లుండే... నేడు ఖమ్మం ఎట్లుందని అన్నారు. ఎక్కడ చూసినా చెత్తాచెదారమే.. అసలు ఖమ్మం కార్పొరేషన్ వ్యవస్థ పని చేస్తుందా..? ప్రజలు వ్యాధుల బారిన పడుతున్న సోయా లేకపోయిందని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనలు చూసి ఆశ్చర్యపోయానని, అసెంబ్లీలో జరిగిన సంఘటనలు ప్రజలు చూస్తున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. నా బిల్డింగ్ లు కులుస్తారు అని భయపడే వాడిని కాదని, పదవులు ఇస్తారని ఆశపడే వాడిని కాదని, తాను ఎప్పటికీ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. మొన్నటివరకు కాలేశ్వరం వల్ల రాష్ట్రానికి ప్రయోజనమే లేదని పలికిన ఈ జిల్లా మంత్రి.. కాలేశ్వరం పంపులు

ఆన్ చేసి హైదరాబాద్​ నగరానికి తాగునీరు సమస్య లేకుండా చూస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజల కాళ్లు కడగాలని కల నాది అనేవాళ్లు కేసీఆర్ పెట్టిన భిక్షను మర్చిపోయారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై పెడుతున్న కేసులు శాశ్వతంగా నిలిచిపోవన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలో, ఆపై రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నా తడాఖా.. చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మాజీ సూడా చైర్మన్ బచ్చు విజయకుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed