- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాయుడుపేటలో అక్రమ నిర్మాణాలు తొలగింపు
దిశ, ఖమ్మం రూరల్: నాయుడుపేట ప్రధాన కూడలి నుంచి పొన్నెకల్లు గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం కార్పొరేషన్ ఏర్పాటు అయిన దగ్గర నుండి వివిధ ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు.. నాయుడుపేట ప్రధాన కూడలి నుంచి పొన్నెకల్లు గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా విస్తరించి ఉన్నటువంటి అక్రమ కట్టడాలను రూరల్ మండల రెవెన్యూ, మండల పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి రోడ్డుకిరువైపులా ఉన్న మటన్ షాపులు, కూరగాయలు షాపులు, వివిధ రకాల దుకాణాలను రెండు జెసిబిల సహాయంతో తొలగించడం జరిగింది.
కొంతమంది బాధితులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తున్నారని.. తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. కొంతమంది చిరు వ్యాపారులు కొంత డబ్బు వెచ్చించి బలమైన నిర్మాణాలు చేపట్టారు. వీటిని తొలగిస్తున్న క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొంతమంది వ్యాపార మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఏది ఏమైనప్పటికీ రెవెన్యూ, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ సిబ్బంది సహకారంతో.. అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతున్నది.