Rega Kantha Rao : భవిష్యత్ లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే

by Sridhar Babu |   ( Updated:2024-11-03 09:47:37.0  )
Rega Kantha Rao :  భవిష్యత్ లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే
X

దిశ, భద్రాచలం : భవిష్యత్ లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ గ్యారెంటీ లు అమలు చేసేలా పోరాడాలని కార్యకర్తలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాచలం మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ గ్యారంటీలపై క్షేత్రస్థాయిలో ప్రజల్ని జాగృతపరచాలని సూచించారు.

భద్రాచలం మండలంలో ప్రతి వార్డులో బీఆర్ఎస్ కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ మాజీ ఇన్​చార్జి మానే రామకృష్ణ, కోటగిరి ప్రభోద్ కుమార్, ఆకోజు సునీల్ కుమార్, కోలా రాజు, ఉడతా రమేష్, రేపాక పూర్ణచంద్రరావు, అంబటి కర్ర కృష్ణ, పడిసిరి శ్రీనివాసరావు, కొల్లం ప్రేమ్ కుమార్, బాసిబోయిన మోహన్ రావు, కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, కాపుల సూరిబాబు, అనిల్, ఏడుకొండలు, ప్రసాద్, రమేష్, యువరాజు, నరసింహులు, శివ, గణేష్ నాగరాజు, సలోమీ, రాణి, ప్రియాంక, ప్రదీప్, యువజన విద్యార్థి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story