- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ భూముల్లోని మట్టి స్వాహా... చోద్యం చూస్తున్న అధికారులు..
దిశ, ముదిగొండ : ముదిగొండ మండల కేంద్రం కావడం ఖమ్మంకి అది చేరువలో ఉండటంతో ముదిగొండతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. దీంతో రియల్ టర్ల కన్ను ఈ ప్రాంతం పై పడటంతో గత కొంతకాలంగా భారీవెంచర్ లో వెలుస్తున్నాయి. ఈ భూమికి ఒక్కసారే రెక్కలు రావడం ఎక్కువగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడంతో ఒక్కొక్కటిగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. వెంచర్ల ఏర్పాటు వరకు బాగానే ఉన్నా కాసులకే కక్కుర్తి పడుతున్న రియల్ టర్లు ప్రజాసంపదను దోపిడీ చేయడం పై దృష్టిసారిస్తున్నారు. వెంచర్లు సాధారణంగా వ్యవసాయ భూములలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నేలలు ప్రధానంగా నల్లమట్టి, బురద మట్టి నేలలు కావడంతో ఈ భూముల్లో నిర్మాణాలు చేపడితే కొద్ది కాలానికి కుంగిపోయే ప్రమాదం ఉన్నది.
దీంతో నాలుగైదు అడుగుల మేర మట్టిని తవ్వి కంకర, గలసతో నింపి భూమట్టం కంటే ఎత్తుగా చదును చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక వెంచర్ కు వందల నుంచి వేలట్రిప్పుల వరకు మట్టి అవసరం పడుతుంది. మట్టి కావాల్సినవారు మైనింగ్, రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తీసుకొని దానికి కొంతరుసుము చెల్లించి ఆ తరువాతనే మట్టిని నింపుతారు. కానీ ఇవేమీ పట్టని అక్రమార్కులు దర్జాగా వేలాది ట్రిప్లమట్టిని అక్రమంగా తమవెంచర్లకు తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. ముదిగొండ చుట్టుపక్కల గ్రామాలలో గుట్టలు అధికంగా ఉండడంతో ఈ ప్రాంతంలో గ్రావెల్ కి లోటు లేకుండా ఉన్నది. దీనితో రియల్ టర్లు అక్రమంగా తమవెంచర్లకు దర్జాగా మట్టిని తరలిస్తున్నారు. కాగా రియల్ వెంచర్ల యజమానిలు అధికార పార్టీ నాయకులు అవడంతో ఫిర్యాదులు వచ్చిన అధికారులు చర్యలు తీసుకోలేకుండా ఉన్నట్లు సమాచారం.
వీలైతే పగలు, లేకుంటే రాత్రి దర్జాగా ట్రాక్టర్లతో, హెవీ వెహికల్స్ తో వెంచర్లకు మట్టిని తరలిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో ప్రధానంగా నాలుగు వెంచర్లు నిర్మాణంలో ఉండగా వీటన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా చదునుచేసి ప్లాట్లు చేశారు. అయినా కానీ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగే నాథుడే లేకుండా పోయాడు. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇప్పటికే ఏర్పాటు చేసిన వెంచర్లకు జరిమానాలు విధించి భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే వెంచర్లకు మట్టి అక్రమంగా తరలించకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది. అధికారులు ఆ వైపుగా అడుగులు వేస్తారో లేదో వేచి చూడాలి.