- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
భక్తుల చెంతకే రామయ్య సేవలు.. డిజిటల్ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
దిశ, భద్రాచలం : భద్రాద్రి రామయ్య భక్తులకు మరింత చేరువ కానున్నారు. రామాలయంలో ఏ రోజు ఏమి సేవలు జరుగుతాయో గతంలో భక్తులకు తెలిసేది కాదు. దీనివల్ల భక్తులు స్వామి వారి సేవలను వినియోగించుకోలేక పోయేవారు. దీంతో అన్ని సేవలు భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేలా దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నూతనంగా డిజిటల్ సేవలను ప్రవేశపెట్టారు.ఇప్పటికే సుదూర ప్రాంతాలలోని భక్తుల సౌకర్యం కొరకు వసతి తో పాటు 24 రకాల సేవలకు సంబంధించిన టికెట్స్ భక్తులకు ఆన్లైన్ లో లభ్యం అవుతున్నాయి. డిజిటల్ సేవలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో బుధవారం అన్నదానం, ప్రోటోకాల్, స్వామివారికి వస్త్ర సమర్పణ మూడు నూతన డిజిటల్ సేవలను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఈ ఓ రమాదేవి, ఈ ఈ రవీందర్ ఏ ఈ ఓ లు భవాని రామ కృష్ణ, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.