ప్రతిపనిలోనాణ్యత పాటించాలి

by Sridhar Babu |
ప్రతిపనిలోనాణ్యత పాటించాలి
X

దిశ, ఖమ్మం రూరల్ : అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ రామన్నపేట ఎస్సీ కాలనీలో బుధవారం ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ. 25 లక్షలతో చేపట్టిన సీసీ కాలువ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా వేస్తున్న రెండు లైన్ల కాలువ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. మనం చేపట్టే పనులు నాణ్యతతో ఉండాలని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉండొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story