పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పువ్వాడ

by Sumithra |   ( Updated:2023-10-09 09:58:18.0  )
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పువ్వాడ
X

దిశ, భద్రాచలం : ఎలక్షన్ కోడ్ వెలువడిన రోజే హడావుడిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలో రు.54 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కేబినెట్ లో ఇదేచివరి కార్యక్రమం కావడం విశేషం. రూ.39 కోట్లతో నిర్మించనున్న కరకట్ట పొడిగింపు, రూ.15 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

భద్రాచలం ఏరియా వైద్యశాలలో కిచెన్ కాంప్లెక్స్, సీసీ రోడ్స్, ఆప్తాలమిక్ వింగ్, బ్లడ్ బ్యాంకు, మార్చురీ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా పై పనులకు సంబంధించి నిధులు విడుదల కాలేదని తెలిసింది. ఈ పనులను మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 30 న ప్రారంభించాల్సింది. కానీ ఆ రోజు కేటీఆర్ పర్యటన రద్దు కావడంతో సోమవారం పువ్వాడ శంకుస్థాపన చేశారు.

Advertisement

Next Story

Most Viewed