- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యాభివృద్ధికి ప్రాజెక్ట్ వర్క్ దోహదపడుతుంది
దిశ సత్తుపల్లి : విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు ఇచ్చే ప్రాజెక్టు వర్క్ ఎంతగానో దోహదపడుతోందని 18 వ వార్డు కౌన్సిలర్ షేక్ మౌలాలి అన్నారు. బుధవారం పాత సెంటర్ ప్రాథమిక పాఠశాల( ఓల్డ్ యుపీఎస్) ప్రాంగణంలో పాఠశాల ఉపాధ్యాయులు వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి ప్రాజెక్టు పనులను ఇంటి నుంచి తయారుచేసి తీసుకొని వచ్చిన విద్యార్థుల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందం పనితీరు పట్ల తల్లిదండ్రులు సంతృప్తితో ఉన్నారని తెలిపారు. కానీ, త్వరలో ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో బాగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు దూరమవుతున్నందుకు బాధపడుతున్నారని తెలిపారు. మంచి విద్యా ప్రమాణాల సాధనకై పనిచేసే ఉపాధ్యాయులకు సమాజ మద్దతు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు వర్క్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిత్తలూరు ప్రసాద్, ఉపాధ్యాయులు నాగమణి, జయశ్రీ, లాల్ అహ్మద్, పవన్, నరసింహారావు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.