- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటమి భయంతోనే అసత్య ప్రచారాలు.. అజ్మీరా అశోక్ నాయక్
దిశ, ఖమ్మం రూరల్ : ఓటమి భయంతోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పీఎస్ఆర్ జిల్లా యూత్ అధ్యక్షుడు చంద్రునాయక్, అజ్మీరా అశోక్ నాయక్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని సాయి గణేష్ నగర్ గల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓట్లతో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లి ఈరోజు గిరిజనుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. గిరిజనులకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని రిజర్వేషన్లు ఇచ్చి సముచితం గౌరవం ఇచ్చిందన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు రిజర్వేషన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనన్నారు. పొంగులేటి గిరిజనులను కించి పరిచినట్టుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.
దమ్ముంటే ఆధారాలను బహిరంగంగా చూపించాలన్నారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నిన గిరిజనులు కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపే ఉన్నారన్నారు. 60వేల ఓట్లలో 40వేల ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు. గిరిజనులపై కపట ప్రేమ చూపిస్తూ ఒక్క నామినేట్ పడవినైన నియోజకవర్గ వ్యాప్తంగా ఇచ్చారా ? అని ప్రశ్నించారు. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజను వాడుకుని, అగ్రవర్ణాలకే పెద్దపీట వేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ధరావత్ బాబు నాయక్, బోధ వెంకన్న, అజ్మీర కిషోర్, బానోత్ భాస్కర్ నాయక్, ధరావత్ నారాయణ, రూప్సింగ్, బానోత్ సురేష్, భూక్య సర్వర్సింగ్, బానోత్ శంకర్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.