- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి
దిశ భద్రాచలం / బూర్గంపహాడ్ : భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఆదివారం ఐటీసీ విశ్రాంతి భవనంలో జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు, భద్రాచలం అభివృద్ధికి బీపీఎల్ ద్వారా సీఎస్ఆర్ నిధులు కేటాయింపు, సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు నిధులు మంజూరు, భూ సేకరణ, పోడు సమస్య, జిల్లాలో శాంతి భద్రతలు, ఆంధ్రలో కలిసిన 5 పంచాయతీలు తిరిగి తెలంగాణలో విలీన ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఎస్పీ డాక్టర్ వినీత్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాచలం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులు వాటి పురోగతిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదికల రూపొందించాలని కోరారు.
జిల్లాకు సంబంధించి శాంతి భద్రతలు, రెవెన్యూ, గోదావరి, ఇసుక రవాణా, వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులను ఈ సీజన్ లో పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, భూ సమస్యలు, అన్ని శాఖల పెండింగ్ పనులు, మధ్యలో ఆగిపోయిన పనులు సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. పరిపాలనలో నిర్లక్ష్యం, అలసత్వం, అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అన్ని శాఖలను బలోపేతం చేయాలని కోరారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు గిరిజన ప్రాంతాలని, వాటిని అభివృద్ధిలో అగ్రభాగాన నిలపాలని మంత్రి స్పష్టం చేశారు. భద్రాచలం పట్టణ అభివృద్ధికి ఐటీసీ నుండి సీఎస్ఆర్ నిధులను ప్రతి ఏటా 2.50 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ కు అందచేయాలని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ లో కలిసిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి మన రాష్ర్టంలో విలీనం చేయడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భద్రాచలం అభివృద్ధిలో ఐదు పంచాయతీలు చాలా కీలకమని పేర్కొన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి ఎలాంటి సమస్యలు రావొద్దన్నారు. రామాలయం అభివృద్ధితో భద్రాచలం పట్టణ అభివృద్ధికి పట్టణంలోని రహదారులను, డివైడర్లు ఏర్పాటు తదితర ఏర్పాట్లు కు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.