- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pollution : బూడిద వ్యర్థాలతో పర్యావరణ ముప్పు.. ఏమి పట్టనట్టు కేటీపీఎస్ యాజమాన్యం
దిశ,పాల్వంచ: ప్రతిరోజు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్లాంట్ కేంద్రం లలో యాష్ ఫాండ్ బూడిద వ్యర్థాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కర్మాగారం నుంచి ప్రతిరోజు వెలువడే బూడిదతో చెరువులన్నీ నిండిపోతున్నాయి. పేరుకుపోయిన బూడిద నిల్వలను తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంతో పర్యావరణానికి రక్షణ కరువైంది. పాల్వంచ ప్రజలు, స్థానికులు ఎన్నిసార్లు కేటీపీఎస్ యాజమాన్యానికి చురకలు అంటించిన పరిస్థితుల్లో మార్పు రాకపోవడం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బూడిద నిల్వలపై కేటీపీఎస్ యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని పర్యావరణవేత్తలు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కేటీపీఎస్ కర్మాగారాల నుంచి దాదాపు పదివేల టన్నుల బూడిద వ్యర్థాలు యాష్ పాండ్ వెలబడుతుండగా పక్కనే ఉన్న చెరువులన్నీ నిండిపోతున్నాయి. వ్యర్థాలను వాగుల్లోకి తరలించడంలో కేటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్యం తో పర్యావరణ కాలుష్యంలో ముప్పు వాటిల్లి వాతావరణంలో కాలుష్యం ఏర్పడి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంది.
ప్రతిరోజు వేల టన్నుల్లో
పాల్వంచలోని కేటీపీఎస్ 5 6 7 దశల కర్మాగారానికి నాలుగు బూడిద చెరువులు యాష్ పాండ్ లకు 1,146 ఎకరాలు కేటాయింపులు జరిగాయి.కేటీపీఎస్ కర్మ గారాల్లో రోజుకు 25 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును మండిస్తారు దీని ద్వారా సగటున 13 వేల టన్నుల బూడిద విడుదల అవుతుందని తెలుస్తోంది తరలించడంలో ఆదాయాలు కూడా కావలసి వస్తుందని తద్వారా టన్ను బూడిదకు రూ 305 వరకు డిమాండ్ ఉంది. ఈ బూడిదని ఇటుక తయారీలో వంటి పరిశ్రమల్లో వినియోగిస్తారు. ఆ బ్రిక్స్ కంపెనీ కి తరలించి సొమ్ము చేసుకుంటే ఆదాయం రావడం తో పాటు బూడిద గుట్టల నిల్వలు సైతం తగ్గే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యం విడవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు పట్టని కేటీపీఎస్
రోజుకి 10,000మెట్రిక్ టన్నుల బూడిద వ్యర్ధాలు రోజురోజుకు పేరుకు పోతాయి కిన్నెరసాని డ్యాం తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రవహించే అన్ని వాగులు,చెరువుల్లో బూడిద వ్యర్థాలు కలిసి కలుషితం ద్వారా ప్రజలు అనారోగ్య పాలై రోగాల బారిన పడుతున్నారని, ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. బూడిద కాలుష్యంతో పరిసర ప్రాంతాల్లోని నీరు గాలి కలుస్తాం కావడంతో అక్కడ ప్రజలకే కాకుండా జంతువులకు పక్షులకు కూడా ప్రాణాంతకంగా మారింది. బూడిద వ్యర్థాల వల్ల కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ప్రజలు అనారోగ్యల బారిన పడుతున్నారని మూత్రపిండాల వ్యాధులు తలసేమియా తదితర మొదలైన వ్యాధులు ఆధునికంగా వస్తున్నాయని స్థానిక ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరకవాగు కిన్నెరసాని వాగుల్లో బూడిద వ్యర్ధాలు కలుపుతున్నారని వాటి వల్ల ఊపిరితిత్తుల్లోకి నేరుగా దుమ్ము దూళి చేరి అనారోగ్య బారిన పడుతున్నారని పర్యావరణ పరిరక్షణ కాలుష్య మండలి కి ఫిర్యాదు చేశారు. కేటీపీఎస్ కర్మాగారానికి గతంలో 20 నోటీసులు ఇచ్చిన నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమినేది తెలియడం లేదు. ఇప్పటికైనా కేటీపీఎస్ యాజమాన్యం స్పందించి పర్యావరణానికి హాని కలగకుండా బూడిద వ్యర్ధాలను బయటకి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులని కోరుతున్నారు.