- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారీగా మొక్కలు నాటాలి
దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం బయట మొక్కల ప్లాంటేషన్ చేయడానికి స్థలాన్ని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం బయట ఉన్న 1.5 ఎకరాల ఖాళీ భూమిలో మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ ప్రదేశంలో భారీగా మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు. ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మూడు భాగాలుగా విభజించి ఔషధ మొక్కలు, సుందరీకరణ మొక్కలు, భారీ వృక్షాలకి సంబంధించిన మొక్కలను నాటాలని అధికారులకు సూచించారు.
మాతా శిశు కేంద్రానికి వచ్చే రోగులు, ప్రజలకు నీడనిచ్చేలా, ఆరోగ్య కేంద్రం అందంగా ఉండేలా సుందరీకరించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా వర్షం నీరు నిలవకుండా, నీరు భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని, రానున్న వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషంజన్ స్వామి, మున్సిపల్ డీఈ రవి కుమార్ 8, 9 వార్డుల కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.