ప్రజలు ఆలోచించాలి...కమ్యూనిస్టులను బలపరచాలి

by Sridhar Babu |
ప్రజలు ఆలోచించాలి...కమ్యూనిస్టులను బలపరచాలి
X

దిశ, వైరా : రాజకీయాలు వ్యాపారంగా మారిన ప్రస్తుత సమాజంలో చట్టసభలలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం చాలా ఉన్నదని, ప్రజల పక్షాన నికరంగా నిలబడి నిజాయితీగా పోరాటం చేస్తున్న సీపీఎం అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని, వైరా నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చైతన్యంతో ఆలోచించి భూక్యా వీరభద్రంకు ఓట్లు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు విజ్ఞప్తి చేశారు. పార్టీ వైరా నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఆదివారం వైరా పట్టణంలోని మధు విద్యాలయం నందు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2018

నుంచి బీజేపీ బలపడుతూ వచ్చిందని, అది పెరగకుండా నిలువరించేందుకు మునుగోడు ఎన్నికలలో వామపక్షాలు బీఆర్ఎస్ ను బలపరిచాయని, బీజేపీని ఓడించగలిగే పార్టీకి మద్దతు ఇవ్వాలనే పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తో ఎన్నికల సర్దుబాటుకు ప్రయత్నించామని, కానీ కేసీఆర్ బీజేపీతో ఒప్పందం చేసుకోవడంతో ఆ పార్టీలో తెగదెంపులు చేసుకున్నామని అన్నారు. తర్వాత కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసి ఎన్నికలలో కలిసి పోదామని కోరడంతో సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నం చేశామని, కానీ సీపీఎం రాష్ట్ర కమిటీ అడిగిన స్థానాలు ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానపరిచిందన్నారు. చివరికి వారు ఇస్తానన్న మిర్యాలగూడ, వైరా నియోజకవర్గాలను కూడా ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. మునుగోడు ఎన్నికలప్పుడు కేసీఆర్ సీపీఎం మద్దతు అడిగారని, ఆ తర్వాత కూడా ఇది కొనసాగుతుందని కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులే కలిసి పోటీ చేద్దామని అన్నారని తెలిపారు. తాము పొత్తుల కోసం ఎవరితో వెంపర్లాడటం లేదని, బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ

నవంబర్ 10 వ తేదీన వైరా నియోజకవర్గం సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రం నామినేషన్ దాఖలు చేస్తారని, నామినేషన్ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి సీపీఎం సానుభూతిపరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. కార్యకర్తలందరూ తమ శక్తినంతటిని కూడగట్టుకుని, ఉద్యమ ప్రతిష్ట నిలుపుకునే విధంగా, పార్టీ పునాదిని పెంచుకునే విధంగా పనిచేయాలని కోరారు. విజయం కోసం ప్రతి కార్యకర్త ఓక సైనికుడిగా పనిచేయాలని కోరారు. డబ్బులు, అధికారం, పదవుల కోసం పార్టీలు మారే వారిని కాకుండా ప్రస్తుత జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ పార్టీ సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు. ఎన్నికలలో కేవలం డబ్బులు మాత్రమే అభ్యర్థిని గెలిపించవని, బూర్జువా పార్టీ అభ్యర్థులందరూ డబ్బులు పంచుతారని, కానీ ఒక అభ్యర్థి మాత్రమే

గెలుస్తారనే విషయాన్ని సీపీఎం కార్యకర్తలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, వైరా నియోజకవర్గం అభ్యర్థి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, సుంకర సుధాకర్, పారుపల్లి ఝాన్సీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మల్లెంపాటి వీరభద్రరావు, వైరా నియోజకవర్గం పరిధిలోని వైరా రూరల్, కొణిజర్ల, ఎన్కూర్, కారేపల్లి, జూలూరుపాడు మండలాల కార్యదర్శులు తోట నాగేశ్వరరావు, చెరుకుమల్లి కుటుంబరావు, దొంతెబోయిన నాగేశ్వరరావు, కుందనపల్లి నరేంద్ర, యాసా నరేష్, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు,‌ ప్రజా ప్రజాసంఘాల బాధ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed