మాయమాటలు చెప్పే కేసీఆర్‌ను తరిమేయాలి: పొంగులేటి

by Mahesh |   ( Updated:2023-11-20 07:44:54.0  )
మాయమాటలు చెప్పే కేసీఆర్‌ను తరిమేయాలి: పొంగులేటి
X

దిశ, తిరుమలాయపాలెం: తెలంగాణ రాష్ట్రం కోసం 1200 వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి ఆయన తిరుమలాయపాలెం మండలం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పొంగులేటి, హనుమంతరావు మాట్లాడుతూ.. మాయమాటలు చెప్పి అధికారం చెదక్కించుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా తరిమికొట్టాలని అన్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మీరు గెలిపించిన ఎమ్మెల్యే, అభివృద్ధి పేరు చెప్పి పార్టీ మారాను అని చెప్పాడు. అధికార పార్టీలో చేరి డబుల్ బెడ్ రూం ఇల్లు, దళిత బందు, కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇప్పించడాని ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత స్వలాభం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ కు తొత్తుగా మారాడని ఆరోపించారు.

డబ్బు మదం తో, అధికార మదంతో విర్రవీగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి, ప్రజా పరిపాలనకు యుద్ధం జరుగుతుందని అన్నారు. ఈ యుద్ధం లో ప్రజలు బాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెండు సార్లు తెలంగాణా ప్రజలకు మాయమాటలు చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడనీ, తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటైన నెరవేర్చలేదని మండిపడ్డారు.

కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి, రెండు పర్యాయాలల్లో అభివృద్ధి చెయ్యలేకపోయాను, ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే అద్భుతాలు చేస్తాను మాయమాటలు చెపుతునన్నాడని విమర్శించారు. ఇలాంటి మాయమాటలు చెప్పే కేసీఆర్ ను ప్రజలు నమ్మవద్దని, తెలిపారు. ప్రజాపాలన కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం,మీ శ్రీనన్న గెలుపుకోసం, మీరందరూ యుద్ధం చేసి, హస్తం గుర్తుపై ఓటు వేసి కేసీఆర్ చెంప చెళ్లు మనే సమాధానం చెప్పాలని పొంగులేటి కోరారు. నాయకులు బెల్లం శ్రీనివాస్, రామ సహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, కొప్పుల అశోక్, శ్యాం సుందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story