- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రయాణికులకు అందని ద్రాక్షలా చింతకాని రైల్వే స్టేషన్..
దిశ, చింతకాని : బ్రిటిష్ కాలంలో నిర్మించిన చింతకాని రైల్వే స్టేషన్ ప్రజలకు అందని ద్రాక్షలా ఉంది. మండలంలోని ప్రజలు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లాలంటే ఖమ్మం లేదా బోనకల్లు రైల్వే స్టేషన్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కొనసాగుతుంది. చింతకాని స్టేషన్లో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్యాసింజర్ రైలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఒక ఎక్స్ప్రెస్ ఆగిన దాఖలాలు లేవు. చింతకాని రైల్వే స్టేషన్లో కనీసం రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్ లను ఆపాలని ప్రజలు ఎప్పటి నుండో రైల్వే అధికారులకు, మంత్రులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ కోరిక నెరవేరలేదు. పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ ప్రాంతం నుండి ప్రజలు ఎక్కువగా తమ మొక్కులు చెల్లించేందుకు వెళుతుంటారు. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ ను ఇక్కడ నిలుపుదల చేయాలని, అదేవిధంగా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదుకు వెళ్లేందుకు గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ ను ప్రజల సౌకర్యార్థం ఈ రెండు రైళ్లకు హల్టింగ్ ఇవ్వాలని ప్రజల ఆకాంక్ష.
కోట్లు ఖర్చు చేసి ఇటీవలి కాలంలో స్టేషన్ ను అబివృద్ది చేశారు. ఈ సారైనా ఈ ప్రాంత వాసుల కోరిక నేరవేరుతుందని ఆసించిన మండల ప్రజలకు నిరాశే మిగిలింది. గతంలో నామా నాగేశ్వరావు పార్లమెంట్ సభ్యులుగా వున్న సమయంలో మండల ప్రజలు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. ఆయన సమయంలో కూడా మండలంలో వున్న ప్రజా ప్రతినిధులు, ప్రజలు పలుమార్లు కలిసి గొల్కండ, కృష్ణ ఎక్సప్రేస్ రైళ్లకు హల్టింగ్ కల్పించాలని వినతి పత్రాలు ఇచ్చినా నాటి పరిస్తితులు అనుకూలించకపోవడం వల్ల మండల ప్రజల కళ నెరవేరలేదు. ఇప్పటికైనా మండల ప్రజల అవసరాన్ని గుర్తించి కృష్ణ, గొల్కండకి హాల్టింగ్ కల్పించాలని ముక్తకంఠంతో ప్రజలు కోరుతున్నారు.