- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: ఎమ్మెల్యే రేగాకు ఎదురు గాలి.. సోషల్ మీడియాకే పరిమితమంటూ జనం ఆగ్రహం!
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. కానీ ఆ పోస్టులు సోషల్ మీడియాకే పరిమితం తప్ప అభివృద్ధి అనేది ఏమాత్రం జరగడం లేదని ప్రజలు అంటున్నారు.
ఇసుక దందా, భూదందా, సెటిల్మెంట్స్ దందాలు చేపిస్తేనే..? అభివృద్ధి జరుగుతుందా అని కొందరు ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కన పెట్టి తన ముఖ్య అనుచరులతో నియోజకవర్గంలో ఇసుక భూదందా, సెటిల్మెంట్స్ చేపిస్తున్నారనే విమర్శలు జోరుగా వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచినా రేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పిన ఆయన నేడు ఆయన, తన అనుచరులు మాత్రమే అభివృద్ధి చెందారని విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే అక్రమ కేసులు.. నిజమైన నాయకుడని జేజేలు కొడితే జేబులు నింపడం వంటివి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈనాటికి నియోజకవర్గంలో నీళ్ల సమస్య వెంటాడుతోంది. నీళ్లు లేక పేద ప్రజలు పొలంలో వేసిన బోర్ నుంచి నీళ్లు మోసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరి కల్లాలలో రైతుల కన్నీటి గోస ఆరుకాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవాలంటే అడుగ డుగునా ఆటంకాలే ఎదురైనాయి. చివరికి వాహనాలను రోడ్లపైనే నిలిపివేశారు. తన నియోజకవర్గంలో ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు రైతులకు చేసిందేమిటని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క నాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని రేగాపై విమర్శలు చేస్తున్నారు. రైతు ఉత్సవాలు దేనికి చేశారని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం, తరుగు పేరుతో రైతును దోచుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు.
అకాల వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ముంపు ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ విషయం తేలిందే. గోదావరి వరద బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని నిరాహార దీక్ష చేశారు. నేటికీ కొందరు వరద బాధితులకు న్యాయం అందలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ నేటికీ కలగానే మిగిలిందని భాదితులు చెప్పుతున్నారు.
వరద భాదితులను నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతా రావు ఏవిధంగా అందుకున్నారని ప్రశ్నిస్తున్నారు. 5 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు తప్ప చేసిందేమీలేదన్నారు. అకాల వర్షాల వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి నేటికీ ఇండ్ల స్థలాలు కేటాయించలేదని గగ్గోలు పెడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ముంపు ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిందేమీలేదని విమర్శలు కురిపిస్తున్నారు.
2018లో ఎమ్మెల్యేగా ఉన్న పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులకు ప్రభుత్వ భవనాలకు ఆయనే అనుమతులు తీసుకువచ్చారు. అయితే 2018 ఆక్రమంలో పాయం వెంకటేశ్వర్లును ఓటమి వెంటాడింది. దీంతో 2018లో ఎమ్మెల్యేగా గెలిచినా రేగా కాంతారావు పాయం వెంకటేశ్వర్లు తీసుకువచ్చిన అనుమతులను నేడు నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు.
అంటే కష్టం ఒకరిది.. పేరు మరొకరిదని తెలుస్తుంది. కష్టపడిందేమో పాయం అయితే.. పేరు చెప్పుకునేది మాత్రం రేగా. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటున్న రేగాను నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం నమ్మడంలేదంటున్నా ప్రజలు.