అధికారుల కన్నుకప్పి రియల్ దందా...

by Sumithra |
అధికారుల కన్నుకప్పి రియల్ దందా...
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం పరిసర ప్రాంతాల్లో అధికారుల కళ్ళు కప్పి 11 ఎకరాల వెంచర్ ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు. అమ్మకానికి అన్ని అనుమతులు ఉన్నాయి కేవలం గిరిజనులకు మాత్రమే అమ్ముతామంటూ బోర్డు ఏర్పాటు చేసి గిరిజనేతరులకు అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

సర్వేనెంబర్ 36లో గలవెంచర్ వ్యవహారం పై ఆ నోట.. ఈ నోట తెలుసుకున్న జిల్లా అధికారి బోర్డు తీసేయాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గిరిజన చట్టాలు అమలులో ఉన్న స్థలాలలో అన్ని అనుమతులు ఉన్నాయంటూ బోర్డులు ఏర్పాటు చేసి జిల్లా అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జోరుగా చర్చ సాగుతోంది. గిరిజనులకు మాత్రమే హక్కు కలిగిన భూములను గిరిజనేతరులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న రియల్ వ్యాపారస్తుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story