- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సాయివర్ధన్ కుటుంబానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం
దిశ, మధిర : ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామ సమీపంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మాడుగుల సాయివర్ధన్ సోమవారం రాత్రి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, ఎమ్మార్పీఎస్, సీపీఎం నాయకులు మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
దాంతో ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ తో మాట్లాడి కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, ఎక్స్ గ్రేషియా కలెక్టర్ ప్రకటిస్తారని తెలిపారు. దాంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ రెహమాన్ మధిర తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. మధు, రూరల్ ఎస్సై బి.లక్ష్మీ భార్గవి పాల్గొన్నారు.