- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రపంచ దేశాలకు మన మహిళలు ఆదర్శం : ఎమ్మెల్యే సండ్ర
దిశ సత్తుపల్లి : ప్రపంచ దేశాలకు మన మహిళలు ఆదర్శం అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణంలో స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ కమిషనర్ కె.సుజాత, మున్సిపల్ చైర్మన్ కోసంపూడి మహేష్ సభా అధ్యక్షతన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మహిళలు పుష్పాభిషేకం చేశారు. మహిళలు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ స్టాల్స్ ని ఏర్పాటు చేసి వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కొరకు ఆసరా, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటుగా మిషన్ భగీరథ, గురుకుల విద్య, కేసీఆర్ కిట్లు, ఏడీసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, గర్భిణీ స్త్రీలకు ఉచిత సురక్షిత ప్రయాణం వాహనాలను ఏర్పాటు చేసి మహిళలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల్లో పని చేస్తూ ఉత్తమ ప్రతిభను కనబరిచిన మహిళామణులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి మహిళలకు తినిపించారు. సత్తుపల్లి పట్టణానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 411 గ్రూపులకు రెండు కోట్ల 88 లక్షలు, మండలం పరిధిలోని 989 గ్రూపులకు గాను కోటి 79 లక్షల చెక్కులను సభ్యులకు అందజేశారు. స్త్రీ నిధి ద్వారా రుణం పొంది ప్రమాదవశాత్తు మరణించిన షేక్ హుస్సేన్ బి, స్వాతి లకు బీమా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ కొండమ్మ, సూపర్వైజర్ మల్లేశ్వరి, రాజ్యలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలా రాణి, ఎంపీపీ దొడ్డి హైమావతి శంకర్రావు, మెప్మా సుజాత, వార్డ్ కౌన్సిలర్ మండపాటి పద్మ జ్యోతి, కంటే నాగలక్ష్మి, స్వచ్ఛంద సేవ నిర్వాహకులు ఆయోషా, ఐకేపీ అధికారి సుబ్బారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, తుంబురు కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రామారావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మోనార్క రఫీ, మల్లూరు అంకం రాజు, పలువురు వార్డు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు హాజరయ్యారు.