- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Chada Venkata Reddy : ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పేదల బతుకులు మారట్లేదు
దిశ,ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలోని పోత్తూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అధ్యక్షతన సీపీఐ నిర్మాణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కలవేణి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ హయంలో పేద ప్రజలకు రక్షణ కరువైందని, పైసలు ఉన్నోడే పెద్దోడని లేనోడు ఎప్పటికీ గరోబోడని ఈ ప్రభుత్వ హయంలో నిజమైందని అన్నారు. శ్రమకు తగ్గ ఫలితం ఉండాలని, ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ ఉండాలన్నారు. ఇండ్లు లేక చాలా మంది గుడిసెల్లో ఉన్నారని, ఎవరు అధికారానికి వచ్చిన పేదల బ్రతుకులు మారట్లేదని, కార్మికుల పరిస్థితి అడుక్కునేల ఉందన్నారు. గత ప్రభుత్వ హయంలో గుట్టలకు రైతు బంధు ఇచ్చారని, నిజమైన రైతులకు మొండి చెయ్యి చూపారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని, అహంకారంతో ముందుకు వెళ్లడం వల్ల గద్దె దిగాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి, చేసి పేదోళ్ల బతుకుల్లో వెలుగులు నింపాలన్నారు. అనంతరం కలవేణి శంకర్ మాట్లాడుతూ ప్రజల మధ్యలోకి పోవడానికి నిర్మాణ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. సిరిసిల్ల జిల్లా కమ్యూనిస్టు పార్టీ కి కంచుకోట అని, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. అవినీతి లేకుండా మన నాయకులు శాసన సభ వెళ్లడం జరిగిందని, అందుకే కమ్యూనిస్టు పార్టీ ప్రజలతో మమేకమైందన్నారు. ఈ కార్యక్రమంలో మంద సుదర్శన్, మండల కార్యదర్శి సావనపెల్లి మల్లేశం, కెవి అనసుర్య, మీసం లక్ష్మణ్, పంతం రవి, మండల సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.