జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు

by Disha Web Desk 15 |
జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు
X

దిశ, వైరా : జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండవ దశ ఫలితాల్లో వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనపరిచి ఉత్తమ ర్యాంకులను సాధించారు. జేఈఈ మెయిన్స్ లో ఈ పాఠశాలకు చెందిన ఎం.శ్రీ కృష్ణప్రజూన్ 301, ఎం.నమిత 881, వి.సాయి, ధనుష్ 1172, ఐ. ఆకాంక్ష 1292, ఎస్. దీక్షిత 1333, కె.సుదర్శన్ హితార్థ 3387, టి.హేమంత్ 3994, బీ. యుగంధర్ 11271, కె . స్వాత్య 12288, ఎం.హేమంత్ సాయికృష్ణ 15080, కె. తేజశ్విని 15982, టి.పూజా యామిని 18504, ఎస్. భావన 18563, బీ. వెంకటకృష్ణ 44642, కె .శ్రీలక్ష్మీ 47289, పి .జ్ఞానప్రధ్యుమ్న 49545 ర్యాంకులు సాధించారు.

ఈ సంధర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 14 లక్షలపైగా రాసిన జేఈఈ మెయిన్స్ లో 2.5 లక్షలమంది అర్హత సాధించగా తమ పాఠశాలకు చెందిన మొదటి బ్యాచ్ లోనే 16 మంది ఆల్ ఇండియా ర్యాంకులు సాధించటం వైరా ప్రాంతానికే గర్వకారణం అన్నారు. న్యూలిటిల్ ఫ్లవర్ పాఠశాలలో విద్యార్థులు 6వ వతరగతి నుండి ఐఐటీ ఫౌండేషన్ ను తీసుకొని క్రమశిక్షణగా పట్టుదలగా కష్టాన్ని ఇష్టంతో అధిగమించి జెఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంకులు సాధించి అటు తల్లిదండ్రులకు ఇటు పాఠశాలకు మంచి గుర్తింపును తీసుకొచ్చారని కొనియాడారు. న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దటంలో ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భుమేశ్వరావు, డైరెక్టర్లు డాక్టర్ కాపా మురళీకృష్ణ, కుర్రా సుమన్, లగడపాటి ప్రభాకరరావు, స్కూల్ ప్రిన్సిపాల్ షాజీమాథ్యూ, ఏఓ నరసింహరావు అభినందించారు.



Next Story

Most Viewed