ధూమపానం, మద్యపానం వల్లే ఎక్కువ మరణాలు

by Sridhar Babu |
ధూమపానం, మద్యపానం వల్లే ఎక్కువ మరణాలు
X

దిశ, మధిర : నేడు సమాజంలో ధూమపానం, మద్యపానం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అని మధిర జూనియర్ సివిల్ జడ్జి టి.కార్తీక్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినం సందర్భంగా మండల న్యాయ సేవా అధికార సంస్థ, హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. నాలుగు గోడల మధ్య తీర్పు చెప్పడమే కాదు ఒక బాధ్యతగా న్యాయ విజ్ఞానం, ఆరోగ్యం , ఇతర అంశాలపై బాధ్యతగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ధూమపానం , పాన్ మసాలా ,

గుట్కా , పొగాకు వంటి మాదకద్రవ్యాల వాడటం వల్ల ప్రజలు, యువత క్యాన్సర్ బారిన పడుతున్నారని , చెడు వ్యసనాలకు బానిస కాకుండా దూరంగా ఉండి భవిష్యత్ తరాల వారికి క్యాన్సర్ రాకుండా మంచి సమాజాన్ని నిర్మిద్దాం అన్నారు . వైద్యులు అనిల్ కుమార్, ప్రసన్న కుమారి మాట్లాడుతూ ఊపిరితిత్తులు, గర్భాశయ , కాలేయం , రొమ్ము గడ్డలు , గొంతు మొదలగు శరీరంలోని ప్రతి అవయవం పై క్యాన్సర్లు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్స్ కోట వెంకట్, కన్నెపోగు వెంకటేశ్వర్లు(కే.వీ.ఆర్),స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.లక్ష్మీ రెడ్డి, పీఎల్వీ సుజాత, హాస్పిటల్ సిబ్బంది,పేషంట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story