జర్నలిస్టు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

by Javid Pasha |
జర్నలిస్టు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
X

దిశ, జూలూరుపాడు: కొత్తగూడెంలో సోమవారం గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ రిపోర్టర్ కాళ్లూరి యతిరాజు మృతిపట్ల ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ కాపు కాపు సీతామాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తో కలిసి మృతుడి స్వగ్రామం గుండెపుడిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. యతిరాజు మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని ఎమ్మెల్యే వనమా హామీ ఇచ్చారు. 15 ఏళ్లుగా వృత్తి పట్ల నిబద్ధతతో కాళ్లూరి యతిరాజు పని చేశారని గుర్తు చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలో సీపీఐ నాయకులు షాబీర్ పాషా, డీఎస్పీ వెంకటేశ్వర రావు, సీఐలు సత్యనారాయణ, అబ్బయ్య వసంత కుమార్, ఎస్సై పోటు గణేశ్, జర్నలిస్టులు ఉన్నారు.

Next Story

Most Viewed