- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య..
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రకృతి విపత్తుగా కాలానికి వ్యతిరేకంగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో అన్ని మండలాల్లో చేతికొచ్చిన పంట సగం పంటకళాల్లోనూ సగం కోతకు సిద్ధంగా ఉన్న కారణంగా ధాన్యం సేకరణ పట్ల రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటూ ప్రతి గింజను, అదేవిధంగా అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రైతులకు మనోధైర్యాన్ని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడక వారు హామీ తెలిపారని, సోమవారం ఉదయం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడి, ధాన్యం కొనుగోలు పట్ల సివిల్ సప్లై అధికారులను అప్రమత్తం చేసి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఉదయం నుంచి సివిల్ సప్లై అధికారులు మండలాల్లో పరిశీలిస్తున్నారన్నారు. తడిసిన ధాన్యం పట్ల రైతులు బాధపడద్దని ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. వర్షాలు సంభవిస్తున్నటంలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అధికారులను సూచించినట్లు తెలిపారు. దాన్యం కొనుగోలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కొనుగోలు కొరకు మిల్లుల్లో సరిపోని పక్షంలో ప్రైవేటు గోడౌన్ లల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచే విధంగా ప్రభుత్వ బాధ్యతగా తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకపోయినా బాయిల్డ్ రైస్ ను రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.