ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందిస్తా : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

by Aamani |
ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందిస్తా :  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
X

దిశ,మణుగూరు : పినపాక అనేది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం.ఇక్కడ గిరిజనులు ఎక్కువగా అడవిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తారు.ఆ అడవి నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను,పేద కుటుంబాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా గమ్యం.పినపాక మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే నియోకవర్గానికి భారీగా నిధులు తీసుకువచ్చా.రోడ్లు లేని గ్రామాలకు రోడ్లను మంజూరు చేశా.దాదాపు అన్ని ప్రాంతాలలో కరెంట్, త్రాగునీరు అందిస్తున్నా.అన్ని మండలాల్లో, గ్రామాలలో డ్రైనేజి,బ్రిడ్జిలను మంజూరు చేశా.ఆ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలనీ కూడా సంబంధిత అధికారులకు ఆదేశించా.ప్రతి పేదవాడు,గిరిజనుడు అభివృద్ధి చేయాలన్నదే నా తపన.ప్రతి పేదవాడికి విద్య,వైద్యం అందేలా అన్ని ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులను,ప్రభుత్వ పాఠశాలలను సమకూర్చా.గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు నియోజకవర్గం లో అన్ని శాఖ ప్రభుత్వ భవనాలు మంజూరు చేశా.ఆనాడే ఫైర్ స్టేషన్,ఐటీఐ కాలేజీ,ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,గిరిజనులకు పదోవ తరగతి సెంటర్స్,రెండు కొత్త మండలాల ఏర్పాటు,అంగన్వాడీ సెంటర్లు తదితరవన్నీ ఏర్పాటు చేశానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దిశ ఇంటర్వ్యూలో తెలిపారు.

గిరిజనుడికి విద్య,వైద్యం అందేలా ముందడుగు...

అడవి నమ్ముకొని జీవించే గిరిజన బిడ్డకు విద్య,వైద్యం అందించడమే తన లక్ష్యమన్నారు.ప్రతి గిరిజన బిడ్డ ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత చదువులు చదవాలన్నదే తన తపనన్నారు.డాక్టర్ వృత్తిలో కూడా గిరిజనుడు ఉండాలన్నదే తన కోరికని తెలిపారు.ఆ దిశగానే గిరిజనుడికి మెరుగైన విద్య,వైద్యం అందేలా పని చేస్తున్నాని చెప్పారు.దాదాపు అన్ని ప్రాంతాలలో గిరిజనుల కోసం ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను కూడా నియమించామని చెప్పుకొచ్చారు.అలాగే వైద్యం విషయానికి వస్తే అన్ని మండలంలో ప్రభుత్వ ఆసుపత్రులు,దానికి సంబంధించిన సబ్ సెంటర్లు మంజూరు చేసి నిర్మించానని తెలిపారు.మణుగూరు మండలంలో 100 పడకల ఆసుపత్రి ఉండాలని రూపకల్పన తనదేదని వివరించారు.ఆనాడు వైద్యం కొరత ఉండకూడదని కోట్లడిందే తాను అని పేర్కొన్నారు.ఈనాడు అవి తప్ప కొత్తగా నియోజకవర్గంలో ఏమి లేవన్నారు.ముందు ముందు ఇంకా విద్య,వైద్యం పటిష్టంగా అమలు చేస్తానని తెలిపారు.గిరిజన ప్రాంతానికి అన్ని వృత్తుల డాక్టర్లను తీసుకువస్తాని వివరించారు.గిరిజనులు ప్రవేట్ వైద్యం మరిచేలా చేస్తానని తెలిపారు.

కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశా...

ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు ఉండాలన్నదే తన ఆశయం అన్నారు.మనిషికి గుండె ఎంత ముఖ్యమో అలాగే ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు అంత ముఖ్యమన్నారు.ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడని నేపథ్యంలో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేశానని తెలిపారు. అరకొరగా ఏమైనా గ్రామాలు మిగిలుంటే అవి కూడా త్వరలో పూర్తి చేస్తానని చెప్పారు.సీసీ రోడ్ల తో పాటు డ్రైనేజీలు,బ్రిడ్జిలు,చెక్ డ్యామ్ కూడా భారీగా మంజూరు చేశానని తెలిపారు.ప్రతి సందులో డ్రైనేజి వ్యవస్థ ఉండాలనన్నదే తన సంకల్పం అన్నారు.రైతుల కోసమే చెక్ డ్యామ్ లు మంజూరు చేశానని తెలిపారు.రైతు పండించే పంట పొలాలకు చెక్ డ్యామ్ లే ఉపయోగపడతాయన్నారు.దాదాపు అన్ని గ్రామాల్లో కూడా భారీ బ్రిడ్జిలను మంజూరు చేశానని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందిస్తా...

ప్రభుత్వం అందిస్తున్నా ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందిస్తామని ఆయన తెలిపారు.పేదవాడి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు పెట్టిందని ఆ పథకాలు పేదవారికి అమలు అయ్యేలా చూడటమే తన బాధ్యత అన్నారు.ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందాలని నియోజకవర్గ అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసి చెప్పుతున్నాని చెప్పారు.అధికారులు కూడా ఆ దిశగా పని చేస్తున్నారని తెలిపారు.అలాగే అర్హులైన నీరు పేదలకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు మంజూరు చేస్తానని తెలిపారు.ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తానన్నారు.నిజమైన పేదవాడు ఎవరో అధికారుల ద్వారా గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.పేదవాడు ఎవరైనా సరే ప్రభుత్వ పథకాలు అందకపోతే సరాసరి తన ఇంటికే రావచ్చని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed