Sri Lanka : శ్రీలంక ఆర్థిక పునర్నిర్మాణంపై భారత్ కీలక ప్రకటన

by Hajipasha |
Sri Lanka : శ్రీలంక ఆర్థిక పునర్నిర్మాణంపై భారత్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : శ్రీలంక నూతన అధ్యక్షుడు దిస్సనాయకే, ప్రధానమంత్రి అమరసూర్యలతో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం కొలంబోలో భేటీ అయ్యారు. శ్రీలంక ఆర్థిక పునర్నిర్మాణానికి సాయం అందించడాన్ని కొనసాగిస్తామని ఎస్.జైశంకర్ ఈసందర్భంగా వారికి హామీ ఇచ్చారు. టూరిజం, ఇంధన ఉత్పత్తి, పెట్టుబడులు, ఫిషరీస్, భద్రత వంటి విభాగాల్లో శ్రీలంకతో సహకార భావంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముల తరఫున శ్రీలంక నూతన అధ్యక్షుడు, ప్రధానమంత్రులకు అభినందన సందేశాన్ని జైశంకర్ తెలియజేశారు. విదేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు రూ.4 లక్షల కోట్ల రుణాలను తిరిగి చెల్లించలేక 2022 ఏప్రిల్‌లో శ్రీలంక దివాలా తీసింది. ఆ కష్ట కాలంలో లంకకు రూ.33వేలకోట్ల ఆర్థికసాయాన్ని అందిస్తామని భారత్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed