ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి పొంగులేటి క్రిస్మస్ శుభాకాంక్షలు

by Sridhar Babu |   ( Updated:2023-12-24 12:37:50.0  )
ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి పొంగులేటి క్రిస్మస్ శుభాకాంక్షలు
X

దిశ, కూసుమంచి : ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. యేసుక్రీస్తు జన్మించిన రోజును క్రిస్టియన్లు ఎంతో భక్తి, శ్రద్దలతో జరుపుకుంటారని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, ఏసుక్రీస్తు చల్లని దీవెనలు ప్రజలకు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. నిరుపేదలు పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం క్రిస్మస్ బహుమతులు అందచేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story