Minister Ponguleti : పాలేరు ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి పొంగులేటి

by Sridhar Babu |
Minister Ponguleti : పాలేరు ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన  మంత్రి పొంగులేటి
X

దిశ, కూసుమంచి : దేవుళ్లు దీవించబట్టే ఇందిరమ్మ రాజ్యంలో రెండు పంటలకు సరిపడా నీరు వచ్చిందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ ఎన్ఎస్పీ ఎడమ కాలువకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి నీటిని విడుదల చేశారు.

పంట పొలాలు సాగునీటి కోసం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదని ,ఇప్పుడు విడుదల చేసిన సాగర్ జలాలను అవసరమైన మేరకు పంటలకు వాడుకోవడంతోపాటు చెరువులను కూడా నింపుతామన్నారు. పాలేరు ఎడమ కాలువ నుంచి విడుదల చేసిన

నీరు తెలంగాణలో 2 లక్షల 75 వేల ఎకరాలు, ఆంధ్రాలో లక్ష 20 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. గత సీజన్లో డ్యామ్ లో తగినంత నీరు లేకపోవడంతో ఒక పంటకే నీటిని విడుదల చేశారని, కృష్ణ బేసిన్ లో నీటి కొడతా ఏర్పడితే సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేందుకు వీలైనంత తొందరగా పూర్తి చేస్తామన్నారు. ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. అంతకంటే ముందు నీళ్లు వదిలే సమయానికి పవర్ జనరేషన్ ఎందుకు సిద్ధం కాలేదన్నారు.

జీతాలు తీసుకుంటున్నారుగా... పనిచేయలేరా అని పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నెస్పీ అధికారులు, క్యాంపు కార్యాలయ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్ నాయక్, యడవల్లి ముత్తయ్య, కూసుమంచి మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, బజ్జురి వెంకట్ రెడ్డి, జొన్నలగడ్డ రవి, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, చాట్ల పరశురామ్, రవి, మహిపాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed