వైద్యం కోసం పడరానిపాట్లు

by Sridhar Babu |
వైద్యం కోసం పడరానిపాట్లు
X

దిశ,మణుగూరు : ఆ ఊర్లు మారుమూల దట్టమైన అడవీప్రాంతంలో ఉంటాయి. చీకటి పడితే చాలు ఆ ఊర్లలోకి వెళ్లాలంటే దారి కూడా సరిగా కనపడదు. ఈ గిరిజనులు పట్టణానికి రావాలంటే కత్తిమీద సాములాంటిదే. నేటికీ ఆ ఊర్లకి వెళ్లడానికి కనీస రవాణా వ్యవస్థ లేదు. వీరు అనారోగ్యం బారిన పడ్డ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే కనీసం 10 నుంచి 15 కిలో మీటర్లు నడవాల్సిందే.

ఆ గ్రామాలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రేగులగండి, మనుబోతులగూడెం. మనుబోతులగూడెం ప్రాంతానికి చెందిన జోగయ్య కుమారుడు భీమయ్యకు జ్వరం వచ్చింది. వైద్యం కోసం జోగయ్య సతీమణి వీడమ్మ మంగళవారం తన పసిబిడ్డను చంకన ఎత్తుకొని 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సందర్భంగా దిశ ప్రతినిధి ఆమెను పలకరించగా తమకు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed