- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేయండి
దిశ,తల్లాడ : సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తల్లాడ మండలంలో దాదాపు 100 కోట్ల పైన అభివృద్ధి పనులు జరిగాయని, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలు నమ్మి ప్రజల మోసపోవద్దని సత్తుపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని అంబేద్కర్ నగర్, రంగం బంజర, మల్సూర్ తండా, లక్ష్మీపురం గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడపగడపకు తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు. మండలంలో చేసిన అభివృద్ధి పనులు గురించి వివరించారు. సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఇప్పటికే మూడుసార్లు గెలిపించి అండగా ఉన్నారని, నాలుగోసారి ప్రజల ఆశీస్సులు అందించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నవంబర్ 1వ తేదీన కల్లూరులో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ భద్రరాజు, వీర మోహన్ రెడ్డి, వెంకటలాల్, జొన్నలగడ్డ కిరణ్, ఎస్కే బాబు, ఓబుల సీతారామరెడ్డి, కేతినేని చలపతిరావు, బద్దం కోటిరెడ్డి, దగ్గుల రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.