దుమ్ములేపిన ఖమ్మం మినిస్టర్స్ టూర్

by Sumithra |
దుమ్ములేపిన ఖమ్మం మినిస్టర్స్ టూర్
X

దిశ, ఖమ్మం రూరల్ : మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో కాంగ్రెస్, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఘనస్వాగతం లభించింది. మంత్రి హోదాలో తొలిసారి ఇక్కడికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్, ఎర్రజెండాల రెపరెపల నడుమ సీపీఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా కాన్వాయ్ లో ఉన్న మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు తుంబురూ దయాకర్ రెడ్డి, తమ్మినేని నవీన్, అంబటి సుబ్బారావు, శివారెడ్డి, కిషోర్, హరి, వెంకట రెడ్డి, కిషోర్ రెడ్డి, వేరెల్లి అప్పారావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిడకంటి చిన్న వెంకటరెడ్డి, అజ్మీర రామ్మూర్తి నాయక్, పగిళ్ల వీరభద్రం, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఎడ్లపల్లి శంకరయ్య, మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఆరెంపుల సతీష్, సీపీఐ మండల సమితి సభ్యులు పాసంగుల చందర్రావు (సొసైటీ డైరెక్టర్), లింగా వెంకటనారాయణ, మామిడి శంకర్ రెడ్డి, వెంపటి సురేందర్, పెండ్లి నర్సిరెడ్డి, దండి రంగారావు, వెన్నం భాస్కరరావు, రాయల అప్పయ్య మేళ్లచెరువు రవి ,కొనకటి కృష్ణారెడ్డి, గూడ బాబు రెడ్డి, సర్పంచ్ బండి ఉపేందర్, ఎంపీటీసీ బానోతు రామ్మూర్తి, యువజన సంఘం సభ్యులు వెంపటి రాము, మేళ్లచెరువు రాజేష్, ఏపూరి పెద్ద గోపి, మామిడాల కిరణ్ రెబ్బగొండ్ల గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed