KUDA :‘కుడ’ ఏర్పాటుకు జీఓ జారీ

by Sridhar Babu |
KUDA :‘కుడ’ ఏర్పాటుకు జీఓ జారీ
X

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు, పరిసర గ్రామాలను కలుపుతూ కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Kothagudem Urban Development Authority)(KUDA కుడ ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కుడ ఏర్పాటుతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి సాధిస్తాయని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Koonanneni Sambasivarao)పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితంగా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాలుగా రోజురోజుకు విస్తరిస్తున్నాయని, షెడ్యూల్ భూములు, సింగరేణి, ఇతర పరిశ్రమల భూములు ఎక్కువగా ఉండటంతో కుడ ఏర్పాటు వలన ఈ ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందన్నారు.

కొత్తగూడెం, పాల్వంచ (Kothagudem, Palvancha)పట్టణాలను అభివృద్ధిలో మహానగరాలకు ధీటుగా అభివృద్ధి సాధించాలంటే కుడ ఏర్పాటు తప్పనిసరని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపి జీఓ జారీ చేసిందని తెలిపారు. దీంతో అనతికాలంలో జంట పట్టణాలతోపాటు నియోజకవర్గం ఊహించని రీతిలో అభివృద్ధి సాధిస్తుందని, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. తన విజ్ఞప్తిపై స్పందించి కుడ ఏర్పాటుకు జీఓ జారీచేసిన ప్రభుత్వానికి కూనంనేని అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed