మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే వనమా

by Sridhar Babu |
మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే వనమా
X

దిశ, పాల్వంచ : తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్​ లక్ష్యం అని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక పాత ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో పాల్వంచ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వనమా కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. సుమారు రూ.4 కోట్ల వడ్డీ లేని రుణాలను స్వయం సంఘాలకు పంపిణీ చేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలను ఘనంగా సన్మానించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు వనమా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహిళల కోసం ఆరోగ్య మహిళ, వడ్డీ లేని పొదుపు రుణాలు పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డీసీసీబీ మేనేజర్ వసుమతి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బరపాటి వాసుదేవరావు, ఎంపీపీ మడివి సరస్వతి, సొసైటీ అధ్యక్షులు కాంపెల్లి కనకేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, ఎస్విఆర్కె ఆచార్యులు, కిలారు నాగేశ్వరరావు, మహిపతి రామలింగం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాథం, కాల్వ ప్రకాశరావు, బండి చిన్న వెంకటేశ్వర్లు, కుమ్మరికుంట్ల నాగా, నవభారత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed