- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం
దిశ, ముదిగొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని ధనియాలగూడ గ్రామంలో భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని, ఇంజనీరింగ్ మార్వెల్ అని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వచ్చి చూడాలని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పిందన్నారు. కాలేశ్వరం డిజైన్ సక్రమంగా లేదని, నిర్మాణం అవకతవకలతో జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పిందని, అదే విషయాన్ని నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీరింగ్ అధికారిగా డిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులు చెప్పినా వినకుండా వారి పనిని వారిని చేసుకొనివ్వని ఫలితమే కాలేశ్వరం కుంగుబాటు అన్నారు. 28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి లక్ష 25 వేల కోట్లకు పెంచి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ చేసి లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అదనంగా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ లో 15 నుంచి 25
మధ్యన పిల్లర్లు కుంగిపోవడం అత్యంత ప్రమాదకరంగా మారి బ్యారేజ్ పై రాకపోకలు నిలిపివేయాల్సిన పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ప్రజలకు తెలియకుండా ఉండాలని దాచిపెట్టిన కుట్రలను కాంగ్రెస్ భగ్నం చేసిందన్నారు. మేడిగడ్డలో జరిగిన ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందర్శించి ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. కాలేశ్వరం రాష్ట్రానికి గుదిబండ లా మారుతుందని కాంగ్రెస్ చెబితే రాజకీయం చేస్తున్నారని అన్నారు. మీడియాను వెళ్లనివ్వ కుండా వాస్తవాలు తెలుసుకోనివ్వడం లేదన్నారు. బ్యారేజీలో నీళ్లు నింపితే ప్రమాదకరమని నేషనల్ సేఫ్టీ డ్యాం అథారిటీ అధికారులు నివేదికలో పొందుపరిచారన్నారు. మేడిగడ్డ నిర్మాణ విషయంలో నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ అధికారులు 20 అంశాలపై వివరాలు కోరగా 11 అంశాలను మాత్రమే ఇచ్చి మిగతా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాస్తుంది అని అన్నారు. తానే డిజైన్ చేస్తాను, కుర్చీ వేసికొని కట్టిస్తాను అని గొప్పలకు పోయి హడావిడిగా కాలేశ్వరం నిర్మాణం చేసి లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో పోశారన్నారు. ఎలాంటి అర్హత ఉందని
కేసీఆర్ ఇంజనీరింగ్ అధికారిగా ప్రాజెక్టుకు డిజైన్ చేసిండన్నారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టి అందులోంచి కమిషన్లు దండుకోవడానికి సీఎం కేసీఆర్ కాలేశ్వరం రీ డిజైన్ చేశారని ఆరోపించారు. 1960 లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు అనేక వరదలు తట్టుకొని నేటికీ చెక్కుచెదరలేదన్నారు. పట్టుమని పది రోజులు కాకముందే కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనం అన్నారు. జాతి సంపదతో కట్టే ప్రాజెక్టులకు నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ లు ఇచ్చి పరోక్షంగా బీఆర్ఎస్ తో కుమ్మక్కు అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని మాట్లాడుతున్నటువంటి ప్రధాని మోడీ, అమిత్ షా లు చర్యలు తీసుకోవడానికి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సెంట్రల్ విజిలెన్స్ కానీ,దర్యాప్తు సంస్థలతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తక్షణమే విచారణ చేయించాలని, లేనిపక్షంలో కేంద్రం రాష్ట్రంతో కలిసి పోయినట్లుగా అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.