బీజేపీలో చేరిన జలగం

by Sridhar Babu |   ( Updated:2024-03-10 15:46:16.0  )
బీజేపీలో చేరిన జలగం
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు బీజేపీలో చేరాడు. ఆదివారం న్యూఢిల్లీలోని బీజేపీ సెంట్రల్‌ ఆఫీస్‌ నందు తెలంగాణ ఇంచార్జ్‌ తరుణ్‌ జూగ్‌, జాయినింగ్‌ కమిటీ కన్వీనర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ బోర్డ్‌ మెంబర్‌ కోవా లక్ష్మణ్‌, మహేష్‌ రెడ్డి, ఈవీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అయితే జలగంకు బీజేపీ నుండి పార్లమెంటు టికెట్‌ ఇస్తారు అనే చర్చ ఉమ్మడి జిల్లాలో జరుగుతోంది. బీజేపీ అధిస్టానం

ఎంపీ టికెట్‌ హామీ మేరకే పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. గతంలోను జలగం సత్తుపల్లి, ఖమ్మం,కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. ప్రజాధారణ ఉన్న నాయకుడు అవ్వడంతో ఖమ్మం భరిలో నిలుస్తారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగలం కొత్తగూడెం నియోజకవర్గం నుండి స్వాతంత్ర పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 52వేలకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం. బీజేపీ బలహీనంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకట్రావు ఎంట్రీ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ బలపడనుంది.

Advertisement

Next Story