'స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ ని బ్రతికించింది ఆర్యవైశ్యులే'

by Sumithra |   ( Updated:2023-11-02 06:45:25.0  )
స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ ని బ్రతికించింది ఆర్యవైశ్యులే
X

దిశ, ఖమ్మం : స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీని బ్రతికించింది ఆర్య వైశ్యులేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని 32వ డివిజన్ లో బొలిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజలంతో నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర వున్న ఖమ్మం నేడు అరాచకాలకు, అవినీతికి, భూ కబ్జాలకు ఆలవాలమైందన్నారు. ఎక్కడ చూసిన అరాచకాలు, భూ ఆక్రమణలతో సామాన్యులు బ్రతకలేనీ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమికి భయపడి దిగజారుడు మాటలు మాట్లాడారన్నారు.

పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను మీరు ఏవిధంగా దోపిడి చేశారో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తెల్చబోతున్నరని హెచ్చరించారు. మీ కుటుంబం అవినీతితో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిందని, దళిత బందు, బీసీ బందు పేరుతో ఎస్సీలను, బీసీలను మోసం చేశారని విమర్శించారు. నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదనీ, ఆర్య వైశ్యులకు, ముస్లింల అండ లేకుండా ఖమ్మంలో ఏ నాయకుడు కుర్చీ ఎక్కిన చరిత్ర లేదని గుర్తు చేశారు. గతంలో కూడా ఆర్య, వైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చాననీ, భవిష్యత్తులో కూడా ఆర్య,వైశ్యులకు అధిక ప్రాధన్యత ఇస్తాననీ హామీ ఇచ్చారు.

అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకుని వుండాల్సిన లక్షణాలకన్న భిన్నమైన లక్షణాలు కలిగి వున్న వ్యక్తి పువ్వాడ అజయ్ అన్నారు. కక్ష సాధింపు అతని నైజమని ఏ సామాజిక వర్గం దగ్గరకు వెళితే ఆ పేరు తగిలించుకుని తిరుగుతున్న మేక వన్నె పులి పువ్వాడ అజయ్ అని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి చేసే నాయకుడు కావాలో అరాచకాలు చేసే నాయకుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలనీ అన్నారు.

నిన్న జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అరచాకంగ సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. మేము అరాచకంగా సంపాదించడానికి మీలాగా ముఖ్యమంత్రులం, మంత్రులం కాదని ఎద్దేవా చేశారు. మీరే రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారనీ, నిన్న నీ ప్రసంగం చూస్తుంటే ఓటమిని అంగీకరించినట్లుందనీ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను శుభకార్యనికి ఇచ్చిన గడియారాలు గురించి కూడా ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడారనీ రాబోయే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ని పర్మినెంట్గా పాం హౌస్ కి పరిమితం చేస్తారని ఘాటుగా విమర్శించారు.

ప్రశాంతమైన జీవితం గడపాలంటే, అరాచకాలు లేని ఖమ్మంను చూడాలంటే తుమ్మల ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సిటి కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుగ్గల ఈశ్వరలింగం, యెర్నేని రామారావు, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, మున్నూరు కాపు సంఘం నాయకులు శెట్టి రంగారావు, పొదిలి రవికుమార్, తాళ్లూరి హనుమంతరావు కార్పొరేటర్లు నాగండ్ల దీపక్ చౌదరి, దొడ్డా నగేష్, వడ్డేబోయిన నర్సింహారావు, కోసూరి రమేష్ గౌడ్, శంకర్ నాయక్, కల్లూరి సోమనాథం, నరాల నరేష్, బాణాల లక్ష్మణ్, రుడావత్ రమాదేవి తదితర ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed