- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమతుల పేరుతో అక్రమాలు.. వైరాలో యథేచ్ఛగా మట్టి దందా
దిశ, వైరా: మధ్య తరహాకు చెందిన వైరా రిజర్వాయర్ నుంచి అనుమతులు పేరుతో అక్రమంగా మట్టి తోడేస్తున్నారు. రిజర్వాయర్ మట్టితో వైరాతో పాటు పరిసర గ్రామాల్లో గత ఐదు రోజులుగా మట్టి దందా కొనసాగుతోంది. వైరా రిజర్వాయర్ నుంచి రైతుల పొలాలకు నల్ల మట్టి తోలుకునేందుకు కొంతమంది రైతుల పేర్లతో అనుమతులు తీసుకున్నారు. ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ట్రాక్టర్ యజమానులు మట్టి దందాకు తెర లేపారు. వైరాలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు, రియల్ ఎస్టేట్ స్థలాలకు, పరిసర గ్రామాల్లోని ఇళ్లకు ఒక్కో ట్రిప్పుకు రూ.800 నుంచి రూ.వెయ్యికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
నిబంధనలకు పాతర..
అనుమతుల పేరుతో వైరా రిజర్వాయర్ మట్టి తవ్వకాల్లో నిబంధనలకు పాతర వేశారు. నిబంధన ప్రకారం రిజర్వాయర్లో మట్టి కోసం రెండు అడుగుల లోతు మాత్రమే జేసీబీతో తవ్వాల్సి ఉంటుంది. అయితే, అందుకు విరుద్ధంగా నాలుగో అడుగులు లోతు తవుతున్నారు. కొంతమంది ట్రాక్టర్ యజమానులు గలస కోసం రిజర్వాయర్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు కొనసాగిస్తున్న నీటి పారుదల శాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. పినపాకకు చెందిన ఓ ట్రాక్టర్ యాజమాని ఆధ్వర్యంలో ఇప్పటికే వందలాది ట్రిప్పులు అక్రమ విక్రయాలు జరిగాయి. వైరాకు చెందిన ట్రాక్టర్ యజమానులు కూడా ఇంటి పునాదులకు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు మట్టిని అక్రమ రవాణా చేశారు.
ఐదు రోజులుగా అక్రమ రవాణా
అనుమతులు పేరుతో వైరా పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు రిజర్వాయర్ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈనెల 19న ఐదుగురు రైతుల పొలాలకు నల్ల మట్టిని తోలుకునేందుకు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చారు. మల్లారం చెందిన రైతు కృష్ణయ్యకు 185 ట్రాక్టర్ ట్రిప్పులు, గుండ్రాతి మడుగుకు చెందిన కోటయ్య అనే రైతుకు 220 ట్రిప్పులు, బ్రాహ్మణపల్లికి చెందిన సుధాకర్ అనే రైతుకు 40 ట్రిప్పులు, సోమవారం చెందిన సత్యనారాయణకు 295 ట్రిప్పులు, సిరిపురం గ్రామానికి చెందిన బి.విజయకు 25 ట్రిప్పులు తోలుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.
అయితే, ఈ అనుమతులు అడ్డుపెట్టి ఈనెల 20 నుంచి గత ఐదు రోజులుగా మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. రోజుకు ఒక అనుమతి మంజూరు పత్రాన్ని అడ్డుగా పెట్టుకుని సుమారు రెండు వందల ట్రిప్పులు మట్టిని అక్రమ రవాణా చేశారు. ఇలా గడిచిన ఐదు రోజుల్లో 3 వేల ట్రిప్పుల మట్టిపైగా అక్రమ రవాణా జరిగింది. అనుమతులు ఇచ్చాం.. అక్రమ మట్టి రవాణాతో మాకేం సంబంధం అన్నట్లుగా నీటి పారుదల శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ మట్టి రవాణాను అరికట్టాలని ఆయకట్టు రైతాంగం కోరుతున్నారు.