Internet :మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలి

by Sridhar Babu |
Internet :మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలి
X

దిశ, కొత్తగూడెం : మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టెలికం శాఖ ఇన్​చార్జ్ ఎస్.తారాచంద్ (S.Tarachand in charge of Telecom Department)ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ (Collector Jitesh V.Patil)తో కలిసి జిల్లాలో బీఎస్ఎన్ఎల్, టీ.ఫైబర్ సిబ్బంది చేపడుతున్న ఇంటర్నెట్ 4జీ మొబైల్ టవర్స్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తారాచంద్ మాట్లాడుతూ నేటి రోజుల్లో సెల్, ఇంటర్​నెట్​ సేవలు చాలా అవసరమని, ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రాధాన్యతను బట్టి టవర్ల నిర్మాణం చేపడతామన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్, 4జి మొబైల్ సేవలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఇంటర్నెట్, 4జి మొబైల్ సేవలు అందించడం కోసం తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్ చేపడుతున్న అభివృద్ధి పనులు జిల్లా పంచాయతీ, ప్లానింగ్ అధికారుల సమన్వయంతో పూర్తి చేయాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయటానికి ప్రజల్లో రేడియేషన్ గురించి వీడియోల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. తద్వారా మారుమూల గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థులు, ప్రజల అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఎన్ఐసీడీఐజీ సుశీల్ కుమార్, బీఎస్ఎన్ఎల్ డీజీఎం శ్రీనివాస్, ఏజీఎం సుధీర్, ఎస్డీఈ సక్రు నాయక్, షకీల్, బాలాజీ, ఏఏఓ ఉదయ్, ఓఎస్ శివరాంజీ, టీ ఫైబర్ ఆఫీసర్ సాయికుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed