సీఎం కేసీఆర్ సభా స్థలం పరిశీలన

by Sridhar Babu |   ( Updated:2023-10-11 10:27:13.0  )
సీఎం కేసీఆర్ సభా స్థలం పరిశీలన
X

దిశ, కూసుమంచి : ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించునున్న పాలేరు ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఆదేశాల మేరకు కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధుల బృందం స్థలాన్ని, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు వేముల వీరయ్య, ఆసిఫ్ పాషా, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య, రూరల్ మండలం బెల్లం వేణుగోపాల్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్ నాయక్, బోడ మంగిలాల్, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు ఓబిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు మాలేడి వెంకన్న, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరశురాం, మీడియా అధ్యక్షులు వడ్త్యా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story