- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టికెట్ రాలేదని ఎవరి మీద యుద్ధం చేయను : Lavudya Ramulu Nayak
దిశ, వైరా : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ కేటాయించలేదని ఎవరి మీద యుద్ధం చేయబోనని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. వైరాలోని రైతువేదికలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే లావుడ్యా రాముల నాయక్ చెక్కులు పంపిణీ చేశారు. వైరా, కొణిజర్ల, కారేపల్లి మండలాలు చెందిన మొత్తం 79 మంది లబ్ధిదారులకు రూ.7,90,9164 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో వైరా జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, తాటిపూడి ఎంపీటీసీ అల్లిక కాటంరాజు భావోద్వేగంగా ప్రసంగించడం పై ఎమ్మెల్యే స్పందించారు. జడ్పీటీసీ నంబూరు కనకదుర్గ మాట్లాడుతూ వైరా టిక్కెట్ ను వేరే వ్యక్తికి కేటాయించినప్పటికీ ఆయన పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పని చేస్తున్నారని కొనియాడారు. రాములు నాయక్ సుఖము వచ్చినప్పుడు పొంగి పోలేదని కష్టమొచ్చినప్పుడు కుంగి పోలేదన్నారు.
రాములు నాయక్ స్థితి ప్రజ్ఞత గల వ్యక్తి అని కొనియాడారు. తాటిపూడి ఎంపీటీసీ అల్లిక కాటంరాజు మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీకి కనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయింపులో పున:పరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండోసారి రాములు నాయక్ అసెంబ్లీకి వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఫ్యాన్ గుర్తు పై గెలిచిన వ్యక్తి బీఆర్ఎస్ లో చేరాడని అతనికి టికెట్ కేటాయించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, బీఆర్ఎస్ కొణిజర్ల మండల నాయకులు పోట్ల శ్రీను కలుగజేసుకొని కాటంరాజు వ్యాఖ్యల పై అభ్యంతరం తెలిపి వారించారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కుటుంబంలో తాను ఒక సభ్యుడునని, తనకు టికెట్ కేటాయించకపోయినా ఎవరి మీద యుద్ధానికి పోనని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ నిర్ణయమే గీటురాయని వివరించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలపై మౌనం పాటించాల్సిందే అని ఆయన వర్గీయులకు హితువు పలికారు. తనకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా, కోపగించుకున్న, చీదరించుకున్న, అవమానించిన సీఎం కేసీఆర్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసిన వారిని కేసీఆర్ మనసులో పెట్టుకుంటాడని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భీష్ముడి అంత బలం తనకు లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో తెలిసి తెలియక ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని సభాముఖంగా వేడుకున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నన్ని రోజులు సానుకూల ఆలోచనలతోనే పనిచేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. గోదావరి, కృష్ణా నదిలో నీరు ప్రవహించినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. తన అనుచరులు ఎవరూ బావోద్వేగానికి గురై తొందరపాటు వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కొణిజర్ల, కారేపల్లి తహశీల్దార్లు ఎర్రయ్య, సురేష్, వైరా ఎంపీపీ వేల్పుల పావని జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, బీఆర్ఎస్ నాయకులు కట్టా కృష్ణార్జునరావు, మచ్చా వెంకటేశ్వరరావు(బుజ్జి), పోట్ల శ్రీనివాసరావు, బాణాల వెంకటేశ్వరరావు, షేక్ లాల్ మహమ్మద్, వై చిరంజీవి, శకుంతల, బోడపోతుల బాబు, కాపా మురళీకృష్ణ, మిట్టపల్లి సత్యబాబు, చెరుకుమల్లి రవి, రావూరి శ్రీను, మద్దెల రవి తదితరులు పాల్గొన్నారు.