- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమస్యలకు నిలయం..జయశంకర్ కాలనీ..!
దిశ, కొత్తగూడెం: లక్ష్మిదేవిపల్లి మండల లోతు వాగు పంచాయతీ పరిధిలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. ఈ కాలనీలో సుమారు 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే రోడ్లు డ్రైనేజీ లేని కారణంగా గిరిజన కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. గత పది సంవత్సరాల క్రితం ఈ కుటుంబాలు ఇల్లందు క్రాస్ రోడ్ నుండి సింగరేణి వసతి గృహం ఎదురుగా ఉన్న పోచమ్మ గుడి వరకు నివాసం ఉండేవి. అయితే రోడ్డు వెడల్పులో భాగంగా ఇక్కడ కుటుంబాలను జయశంకర్ కాలనీకి తరలించారు. ఆ సమయంలో సుమన్యత అధికారులు అన్ని సదుపాయాలతో కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం పట్ల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు లేకపోవడం వల్ల ఇండ్ల ముందు డ్రైనేజీ నీటితోపాటు వరద నీరు సైతం ఉండడంతో కుటుంబాలు అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జయశంకర్ కాలనీకి మట్టితో ఉన్న రహదారంతా బురద మయంగా మారడంతో ప్రజలు నడవడానికి నరకం కనిపించేదని ఆ కాలనీ పెద్దలు వాపోయారు. ఇక్కడ సమస్యలపై ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కునంని దృష్టికి తీసుకుపోవడంతో పాటు ప్రతి సోమవారం కలెక్టరేట్లు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కూడా వినతిపత్రాలు అందించిన ఫలితం లేదని గ్రామస్తులు తెలిపారు. తమ కాలనీకి పక్కా గృహాలు మంజూరు చేసి అన్ని సవలతులు కల్పించాలని జయశంకర్ కాలనీ కుటుంబాలు వేడుకుంటున్నాయి.
24 గంటలు వీధిలైట్ల వెలుగులు...
జయశంకర్ కాలనీలో ఉన్న వీధిలైట్లకు ఆన్ ఆఫ్ స్విచ్ బోర్డు లేని కారణంగా 24 గంటలు వీధిలైట్లు వెలుగుతానే ఉంటాయని పలువురు పేర్కొనడం జరిగింది. వీధిలైట్లకు స్విచ్ బోర్డు లేని కారణంగా ప్రమాదం పొంచి ఉంది. అంతేకాకుండా విద్యుత్తు దుబారా కూడా జరుగుతుంది. అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. 24 గంటల వీధిలైట్ల వెలుగుల సమస్యకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు విద్యుత్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.
నిధులు ఇవ్వలేదు.. అధికారులు స్పందించలేదు: మాజీ ఎంపీటీసీ శిరీష
లోతు వాగు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జయశంకర్ కాలనీలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించలేదు. రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కొరకు నిధుల కోసం కొట్లాడిన ఫలితం లేదు. తమ పదవి కాలంలో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చుట తప్ప సమస్యలు మాత్రం సక్రమంగా పరిష్కారం కాలేదు.