- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెరిగిపోతున్న యాష్ పాండ్ నిల్వలు.. ఆదాయం బూడిద పాలు..!
దిశ, పాల్వంచ: పాల్వంచ కేటీపీఎస్ యాజమాన్యం యాష్ పాండ్ విక్రయాలపై నిరక్ష్యం వహిస్తూ ఆదాయానికి గండికొడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. కేటీపీఎస్ 5, 6దశల ప్లాంట్లలో యాష్ పాండ్ నిల్వలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక్కడ ప్రతిరోజు 23వేల మెట్రిక్ టన్నుల బొగ్గును మండించగా 11వేల మెట్రిక్ టన్నుల బూడిద వస్తుంది. ప్రస్తుతం బూడిద టన్నుకు రూ.304 పైనే ధర పలుకుతోంది. ఈ బూడిదను సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీల వంటి పరిశ్రమలకు విక్రయిస్తూ ఆదాయం పొందాల్సి ఉండగా గత 2017ఏడాది నుంచి నిల్వ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 5, 6ప్లాంట్ల వద్ద ఏడు కోట్ల బూడిద యాష్ పాండ్ నిల్వలు పేరుకుపోయినట్లు తెలుస్తున్నది. ఆదాయం పెంచుకునే వెలుసుబాటు ఉన్నా కేటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు.
పాల్వంచ కేటీపీఎస్ 5, 6 దశల్లో ప్రతిరోజు బొగ్గు మండించడం ద్వారా వచ్చే బూడిద యాష్ పాండ్ నిల్వలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 5, 6 దశల్లో కేటీపీఎస్ ప్లాంట్లో ప్రతిరోజు 23వేల మెట్రిక్ టన్నుల బొగ్గును మండించగా 1100 మెట్రిక్ టన్నుల బూడిద వస్తుంది. 23వేల టన్నుల బొగ్గు మండించి విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఇలా బొగ్గును మండించే క్రమంలో దాదాపుగా 11వేల మెట్రిక్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది. ఈ బూడిదను సిమెంట్ ఫ్యాక్టరీలు , ఇటుక బట్టీల వంటి పరిశ్రమలకు అమ్మకాలు చేస్తూ కేటీపీఎస్ యాజమాన్యం ఆదాయం సమకూర్చుకుంటుంది. బూడిద టన్నుకు రూ.304 పైనే ధర పలుకుతుంది. అలాంటిది కేటీపీఎస్ నుంచి వచ్చిన ఏడు కోట్ల బూడిద యాష్ పాండ్ నిల్వలు5, 6 దశల ప్లాంట్ల వద్ద పేరుకుపోయి ఉన్నాయి.
ప్రస్తుతం యాష్ పాండ్ ధరలు
యాష్ పాండ్ ధరల పట్టికను పరిశీలిస్తే.. 2017 ఏడాదిలో ఉచితంగా ఇచ్చింది. 2018టన్నుకు రూ.10జీఎస్టీతో మొదలుపెట్టి 2019నుంచి 2021 వరకు రూ.65 చొప్పున ఇచ్చింది. 2022లో 100రూపాయల చెల్లించిన వారికి అందజేశారు. 2023 నాటికి తనకు రూ.304పైనే చెల్లించిన వారికి అందజేశారని ఆరోపణలున్నారు. ఇలా ధరలు ఉన్నా.. ఏడు కోట్ల టన్నుల యాష్ పాండ్ నిల్వలు ఉంచి ఆదాయానికి గండి కొడుతున్నారని కేటీపీఎస్ యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి 5, 6దశలలో ఉత్పత్తి అవుతున్న యాష్ పాండ్లో ఉన్న ఏడు కోట్ల టన్నుల యాష్ పాండ్ అమ్మకాలు జరిపి, ఆదాయాన్ని మరింతగా పెంచి, ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాల అభివృద్ధికి కేటాయింపులు చేయాలని స్థానికులు, నాయకులు కోరుతున్నారు.