మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ ధ్యేయం : వైరా ఎమ్మెల్యే

by Aamani |
మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ ధ్యేయం : వైరా ఎమ్మెల్యే
X

దిశ, జూలూరుపాడు: మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలని సంకల్పించి రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీపై మత్స్యకారుల సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. గురువారం జూలూరుపాడు మండల పరిషత్ కార్యాలయా ఆవరణలో జిల్లా మత్స్య శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మండలంలోని మత్స్యకారుల సొసైటీ కి రాయితీపై ప్రభుత్వం అందించిన చేప పిల్లలను వారికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలో ఏడు చెరువుల సొసైటీ లకు 48,750 చేప పిల్లలను అందించినట్లు తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఖమ్మం, జిల్లాలో ప్రత్యేకంగా రెండో ద ఫాలో కూడా చేప పిల్లలను తెప్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, తహసీల్దార్ స్వాతి బిందు, సూపర్డెంట్ తాళ్లూరు రవి, కాంగ్రెస్ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, నాయకులు దుద్దుకూరి మధుసూదన్ రావు, అల్లాడి నరసింహారావు, రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed