- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలు పారాలి
దిశ, అశ్వారావుపేట : గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారాలన్నదే తన రాజకీయ కోరికని.. అందుకోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని బీఆర్ఎస్ అసంతృప్తి నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని తన మాజీ అనుచరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకవల్లి వీరభద్రరావు నివాసంలో శుభకార్యానికి సోమవారం తుమ్మల విచ్చేశారు. తుమ్మల వస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు కాంగ్రెస్ నాయకులతోపాటు
బీఆర్ఎస్ లోని తుమ్మల వర్గీయులు సుంకవల్లి నివాసానికి చేరుకున్నారు. అయితే తుమ్మల కొద్దిసేపు మాత్రమే అక్కడ గడిపి తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఈ ప్రాంతంలో సుంకవల్లి వీరభద్రం మొట్టమొదటి జెండా కట్టిన తర్వాత ఆయన ఇంటి నుంచి ప్రచారం మొదలు పెట్టానన్నారు. అప్పటి నుండి తన రాజకీయ జీవితం జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడినట్టు తెలిపారు. ఈ నియోజకవర్గ ప్రజల అభిమానం మేరకు గోదావరి జలాలను తీసుకువచేందుకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.