భార్యా, తమ్ముడు, కొడుకు దగ్గరి నుంచి వియ్యంకుడి దగ్గర ఆగింది

by Disha Web Desk 15 |
భార్యా, తమ్ముడు, కొడుకు దగ్గరి నుంచి వియ్యంకుడి దగ్గర ఆగింది
X

దిశ ,కొత్తగూడెం : ఢిల్లీలో తల్లీ, కొడుకు, కూతురు మాదిరిగానే ఖమ్మం కాంగ్రెస్ లో కుటుంబ పాలన నడుస్తోందని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. యథా రాజా తధా ప్రజా అన్నట్లు కాంగ్రెస్ వ్యవహారం ఉందని, ఇక్కడి ఉప ముఖ్యమంత్రి తన భార్య కోసం, ఒక మంత్రి తన తమ్ముడి కోసం, మరో మంత్రి తన కొడుకు టికెట్ కోసం పోరాడారని, చివరకు అది ఒక మంత్రి వియ్యంకుడి దగ్గర ఆగింది అన్నారు. మన అభివృద్ధి మన చేతుల్లో ఉండాలా? బైటి నుంచి వచ్చిన వ్యక్తి చేతిలో పెట్టాలా? ఇది లోకల్ కు నాన్ లోకల్ కు జరిగే యుద్ధమా? అని శుక్రవారం సాయంత్రం కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి లో జరిగిన ఎన్నికల ర్యాలీ లో అన్నారు.

తాను ఈ ప్రాంతంలో పుట్టి, పెరిగి, చదివిన వ్యక్తినని, ఇక్కడే తన పొలాలు, స్నేహితులు ఉన్నారని ఆయన చెప్పారు. మన సమస్యలు మనకు తెలుస్తాయా? ఎక్కడి నుంచో వచ్చిన వారికి తెలుస్తాయా? మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం అని అన్నారు. తనకు ఓటువేస్తే నరేంద్ర మోడీకి ఓటు వేసినట్లే అన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంటే, మన ఖమ్మం ఏమి పాపం చేసిందని అయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం రెండు లక్షల రుణమాఫీ, నాలుగు వేల పెన్షన్ పెంపు లాంటి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మాట మారుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని అన్నారు. మన ప్రాతానికి కొత్త ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కొత్త పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలతో అన్ని వర్గాల ప్రయోజనం జరిగిందని అన్నారు.



Next Story

Most Viewed