గబ్బర్ సింగ్‌ ఇండియా ప్రశ్నిస్తుంది.. బీజేపీపై T-కాంగ్రెస్ సంచలన ట్వీట్

by Disha Web Desk 4 |
గబ్బర్ సింగ్‌ ఇండియా ప్రశ్నిస్తుంది.. బీజేపీపై T-కాంగ్రెస్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీ-కాంగ్రెస్ బీజేపీపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. సామాన్యూడిపై జీఎస్టీ బాదుడు ఏంటని మండిపడింది. ప్రతీ పేదవాడి అకౌంట్ లో రూ.15లక్షల జమ ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. గత పదేళ్లుగా 80 కోట్ల మంది ఎదురుచూస్తున్నారని తెలిపింది. రూ.15 లక్షలు ఇవ్వకపోగా మినిమం బ్యాలెన్స్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయల వసూళ్లు చేశారని తెలిపింది. నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీ భారం, పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్, వంట నూనె, కందిపప్పు ధరల పెంచారని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) పేద ప్రజలు, రైతులు, కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలపై భారం చూపిందని పేర్కొంది. పేద ప్రజలు తినే రొట్టెపై, చివరకు పసిపిల్లలు తాగే పాలపై కూడా జీఎస్టీ వసూల్ చేస్తున్నారని మండిపడింది.

Next Story

Most Viewed