United States: అమెరికాలోని హ్యూస్టన్‌లో తుఫాన్ బీభత్సం.. నలుగురు దుర్మరణం

by Shiva |   ( Updated:2024-05-19 09:14:59.0  )
United States: అమెరికాలోని  హ్యూస్టన్‌లో తుఫాన్ బీభత్సం.. నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌లో గురువారం తుఫాన్ బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా విపత్తు రావడంతో జనజీవనం అతలాకుతలం అయ్యారు. తుఫాను కారణంగా మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. గాలి, వాన వల్ల విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో 8 లక్షల గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వరద నీరు భారీ ఎత్తున ప్రవహిస్తుండటంతో పలు వీధులు, కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఆ ప్రాంత పరిధిలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలను మూసి వేశారు.

Advertisement

Next Story